Minister Malla Reddy: కాసేపట్లో ఐటీ అధికారుల ముందుకు మంత్రి మల్లారెడ్డి.. సోదాల్లో సీజ్‌ చేసిన నగదు లెక్కలపై ఆరా..

|

Nov 30, 2022 | 12:26 PM

ఇవాళ విచారణకు ఐటీ అధికారుల ముందుకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఆయనతోపాటు అల్లుడు రాజశేఖర్‌, కొడుకు భద్రారెడ్డి హాజరుకానున్నారు. నిన్న విచారణకు ఆడిటర్‌ సీతారామయ్య, కాలేజీ సిబ్బంది హాజరయ్యారు. ఇప్పటికే 14 మంది విచారణకు హాజరయ్యారు. సోదాల్లో సీజ్‌ చేసిన నగదు లెక్కలు, ఇతరఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు ఐటీ అధికారులు.

Minister Malla Reddy: కాసేపట్లో ఐటీ అధికారుల ముందుకు మంత్రి మల్లారెడ్డి.. సోదాల్లో సీజ్‌ చేసిన నగదు లెక్కలపై ఆరా..
Minister Malla Reddy
Follow us on

ఇవాళ హైదరాబాద్.. బషీర్‌బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరుకానున్నారు. ఆయనతోపాటు అల్లుడు రాజశేఖర్‌, కొడుకు భద్రారెడ్డి హాజరుకానున్నారు. నిన్న విచారణకు ఆడిటర్‌ సీతారామయ్య, కాలేజీ సిబ్బంది హాజరయ్యారు. ఇప్పటికే 14 మంది విచారణకు హాజరయ్యారు. సోదాల్లో సీజ్‌ చేసిన నగదు లెక్కలు, ఇతరఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు ఐటీ అధికారులు. గత వారం ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటితోపాటూ.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా రెండ్రోజులపాటూ సోదాలు నిర్వహించారు.

వారి నుంచి భారీగా డబ్బుతోపాటూ.. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా.. మల్లారెడ్డితోపాటూ.. మరో 16 మందికి నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే మల్లారెడ్డి మరికాసేపట్లో వెళ్లనున్నారు.

మల్లారెడ్డి ప్రధానంగా.. తమ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో పరిమితికి మించి ఫీజులు, భారీగా డొనేషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డబ్బును రియాల్టీ సెక్టార్‌లో పెట్టుబడులుగా పెట్టి.. ఆదాయ పత్రాల్లో చూపించలేదనే ఐటీ అధికారుల ఆరోపణ. దీనిపై ఇవాళ ఐటీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్నది రాజకీయంగా చర్చనీయాంశం మారింది.

ఇవి కూడా చదవండి

మంగళవారం ఆడిటర్‌, మల్లారెడ్డి కాలేజీ సిబ్బందిని విచారిస్తున్నారు. ఆడిటర్‌ సీతారామయ్యతో పాటు మల్లారెడ్డి కాలేజీ సిబ్బంది హాజరయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 14మందిని విచారించనున్నారు ఐటీ అధికారులు. సోదాల్లో సీజ్‌ చేసిన నగదు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఉదయం నుంచి ఒక్కొక్కరుగా నోటీస్‌ కాపీలను తీసుకొని ఐటీ కార్యాలయానికొస్తున్నారు.

ఇవాళ మల్లారెడ్డి చెప్పే సమాధానాలను లెక్కలోకి తీసుకొని విశ్లేషించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన్ను మరో రోజు కూడా విచారణకు పిలుచి అవకాశం ఉంది. ఇవాళ మల్లారెడ్డితోపాటూ.. నోటీసులు అందుకున్న మరో 16 మందిని కూడా ప్రశ్నించనున్నారు ఐటీ అధికారులు. మరి వారిలో ఎంత మంది వస్తారన్నది తేలాల్సిన అంశం. వారంతా చెప్పిన సమాధానాలను బట్టీ.. ఐటీ అధికారులు తమ నెక్ట్స్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం