KTR: ‘సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా వదిలి పెట్టేది లేదు’.. ప్రీతి ఆత్మహత్యపై తొలిసారి స్పందించిన మంత్రి కేటీఆర్‌.

|

Feb 27, 2023 | 5:42 PM

వరంగల్ మెడికల్‌ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని అర్ధాంతంగా తనువు చాలించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది...

KTR: సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా వదిలి పెట్టేది లేదు.. ప్రీతి ఆత్మహత్యపై తొలిసారి స్పందించిన మంత్రి కేటీఆర్‌.
Ktr
Follow us on

వరంగల్ మెడికల్‌ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని అర్ధాంతంగా తనువు చాలించడం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. ఇక ప్రీతిది ఆతహ్మత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు ఓయూ జేఏసీ నేతలు. ఈ ఎపిసోడ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే ప్రీతి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ప్రీతి ఆత్మహత్యకు సంబంధించిన మంత్రి కేటీఆర్‌ తొలిసారి స్పందించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో జరిగిన సభలో కేటీఆర్‌ ఈ విషయమై మాట్లాడారు. ప్రీతి ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మంత్రి తేల్చిచెప్పారు. అది సైజ్‌ కానీ, సంజయ్‌ కానీ ఎవరైనా వదిలి పెట్టేది లేదన్నారు. ప్రీతి ఘటనను కొందరు కావాలనే రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, కానీ.. తాము పార్టీ, ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని చెప్పారు. అన్యాయం చేసిన వాడు ఎవడైనా వదిలి పెట్టమని.. చట్టం, న్యాయం పరంగా శిక్షిస్తామని తేల్చిచెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..