Hyderabad: లోకేష్ బాధను అర్థం చేసుకోగలను.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందన..

|

Oct 14, 2023 | 9:30 AM

చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లోకేష్‌ బాధను తానూ అర్థం చేసుకోగలనన్నారు. కేసీఆర్‌ నిరాహారదీక్ష టైమ్‌లో తానూ అదే బాధను అనుభవించానన్నారు. మీడియాతో మాట్లాడిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనన్నారు. నారా లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమన్నారు కేటీఆర్‌.

Hyderabad: లోకేష్ బాధను అర్థం చేసుకోగలను.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందన..
Telangana Minister KTR
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 14: చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లోకేష్‌ బాధను తానూ అర్థం చేసుకోగలనన్నారు. కేసీఆర్‌ నిరాహారదీక్ష టైమ్‌లో తానూ అదే బాధను అనుభవించానన్నారు. మీడియాతో మాట్లాడిన చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనన్నారు. నారా లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమన్నారు కేటీఆర్‌. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు తెలియదని, కానీ చంద్రబాబు భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమైన విషయమన్నారు. లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలనని..రాజకీయలు వేరైనా ఆయన కుటుంబం భాదను తాను అర్థం చేస్కోగలనన్నారు మంత్రి కేటీఆర్‌.

హైదరాబాద్‌లో ఆందోళనలు వద్దని చెప్పాం: కేటీఆర్‌

నిమ్స్ ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం పై తాము కూడా చాలా ఆందోళన చెందామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు తమను తీవ్ర స్థాయిలో హెచ్చరించారన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేస్కోగలనని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ ఆందోళన చేయడం వద్దనన్నాని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయం ఏపీలోని రెండు పార్టీల మధ్య ఉన్న అంశమని, తమని అందులోకి లాగవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు.

బాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేష్‌ ట్వీట్‌..

రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే జగన్‌దే బాధ్యతన్నారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని ఆరోపించారు. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతూ, ఇన్‌ఫెక్షన్‌, అలర్జీతో బాధపడుతున్నారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..