Ktr vs Revanth: రేవంత్‌పై మంత్రి కేటీఆర్ వ్యవహారంలో మరో కీలక మలుపు.. సిటీ సివిల్ కోర్టులో రీ పిటిషన్..

|

Sep 21, 2021 | 1:51 PM

Ktr vs Revanth: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య పొలిటికల్ వార్ మరో టర్న్ తీసుకుంది. తనపై రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్..

Ktr vs Revanth: రేవంత్‌పై మంత్రి కేటీఆర్ వ్యవహారంలో మరో కీలక మలుపు.. సిటీ సివిల్ కోర్టులో రీ పిటిషన్..
Ktr
Follow us on

Ktr vs Revanth: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య పొలిటికల్ వార్ మరో టర్న్ తీసుకుంది. తనపై రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేవంత్‌పై ఇప్పటికే పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్.. తాజాగా సిటీ సివిల్ కోర్టు రీ పిటిషన్ వేశారు. నిన్న కేవలం పరువు నష్టం దావా మాత్రమే వేసిన ఆయన.. ఇవాళ కోటి రూపాయలకు రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా కేసు వేశారు. అలాగే.. సోమవారం నాడు వేసిన పిటిషన్‌కు సాక్ష్యాలను జత చేసి రీ సబ్మిట్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో మరోసారి పిటీషన్ దాఖలు చేశారు. 39 రూల్ 1, 2 రెడ్ విత్ 151 సీపీసీ ప్రకారం పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు మంత్రి కేటీఆర్. కాగా, కోటి రూపాయల పరువు నష్టం దావా కేసుకు లక్షా 29వేల రూపాయలు కోర్టు ఫీజు చెల్లించారు మంత్రి కేటీఆర్. ఇక ఇంటర్నెట్, వెబ్‌సైట్, సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్‌లో తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని కోర్టును మంత్రి కేటీఆర్ కోరారు. తనపై రేవంత్ రెడ్డి చేసే అసభ్యకరమైన, తన ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలను వార్తా చానెళ్లు, ఇతర మీడియా ప్రసార సాధనాలు ప్రసారం చేయకుండా నియంత్రించాలని కోర్టును మంత్రి కోరారు.

కాగా, గత కొంతకాలంగా మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలతో పాటు.. సినీ తారలతో సంబంధాలు, డ్రగ్స్ కేసులో ఆయకు ప్రమేయం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలతో పాటు.. పరుష వ్యాఖ్యలతో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న మంత్రి కేటీఆర్.. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మాటలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లీగల్ యాక్షన్ ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు ధర్మాసనం త్వరలోనే విచారించనుంది.

Also read:

Viral Video: ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలైయేలా నవ్వుకుంటారు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Konda Vishweshwar Reddy: ఆయన చర్యలు ఉహతీతం.. కొద్దిసేపు ప్రతిపక్షం.. మరికొద్దిసేపు అధికారపక్షం.. అంతుచిక్కని కొండా వ్యూహం!

Crime News: ప్రియుడితో స్కెచ్‌.. భర్తను దారుణంగా చంపిన భార్య.. ఆ తర్వాత ప్లాట్‌లో ముక్కలుగా నరికి..