KTR: పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు.. కేంద్ర మంత్రిపై కేటీఆర్ ఫైర్

|

Dec 18, 2022 | 7:07 AM

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ మధ్య పొలిటికల్ వార్ వేడి పుట్టిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా నేతలందరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది..

KTR: పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు.. కేంద్ర మంత్రిపై కేటీఆర్ ఫైర్
Minister Ktr
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ మధ్య పొలిటికల్ వార్ వేడి పుట్టిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా నేతలందరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి కేటీఆర్.. కేంద్రం తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లోక్‌సభలో చేసిన ప్రకటనపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బల్క్‌ డ్రగ్స్‌ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘ కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారని” ఆవేదన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు.

అబద్ధాలతో పార్లమెంట్‌ను కేంద్రమంత్రి తప్పుదోవ పట్టించారు. ఆయనపై లోక్‌భలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలి. తప్పుదోవ పట్టించినందుకు కేంద్రమంత్రి మాండవీయ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్‌ను ప్రముఖ లైఫ్-సైన్సెస్ హబ్‌కు తిరస్కరించడం దారుణం. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

– ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్..

 

లోక్ సభలో కేంద్రమంత్రి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని చెప్పిన ఆయన.. ఒక్కో దానిపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే.. ఇప్పటికే తెలంగాణలో పాటు, ఆసక్తి చూపించిన రాష్ట్రాలకు రూ.300 కోట్లు ఇచ్చామని చెప్పడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..