KTR: లిక్కర్ ఆఫర్‌పై ట్రోలింగ్.. సోము వీర్రాజు కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్‌ సైటర్లు

|

Dec 29, 2021 | 3:23 PM

KTR On AP BJP Chief Somu Veeraraju: ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్‌ కామెంట్‌కి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కిక్కెక్కించే కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం

KTR: లిక్కర్ ఆఫర్‌పై ట్రోలింగ్.. సోము వీర్రాజు కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్‌ సైటర్లు
Somu Ktr
Follow us on

KTR On AP BJP Chief Somu Veeraraju: ఏపీ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్‌ కామెంట్‌కి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కిక్కెక్కించే కౌంటర్ ఇచ్చారు. అధికారం కోసం ఇంతలా దిగజారుతారా..? అంటూ ప్రశ్నించారు. అది చూసే ముందు అసలు నిన్న సోము వీర్రాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సోము వీర్రాజు నిన్న సభలో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 75కే చీప్‌ లిక్కర్‌. ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకి తగ్గిస్తాం అంటూ హామీనిచ్చారు. దీన్ని ఆఫర్ అనాలో, స్కీమ్ అనాలోగానీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం నిస్సిగ్గుగా అధికారం కోసం ఇంత దిగజారడమా.. అంటూ ట్వీట్ చేశారు. అయినా ఈ ఇది బీజేపీ నేషనల్ పాలసీనా లేదంటే.. ఎక్కడైతే అధికారంలేదో అక్కడ అర్రులు చాస్తూ ఇస్తున్న హై ఆఫరా అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేశారు.

ఈ ట్వీట్‌ తెలంగాణ కేటీఆర్ నుంచి. కానీ.. నేషనల్‌వైడ్‌గా ఇప్పుడు సోము వీర్రాజు ఓ హాట్ టాపిక్ గా మారారు. లిక్కర్ తాగేవాళ్లు కోటి మంది ఓట్లు వేస్తే నాణ్యమైన చీప్ లిక్కర్‌ సరసమైన ధరలకే ఇస్తామని సోము వీర్రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇదిలాఉంటే.. సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై ఏపీ నాయకులు సైతం స్పందిస్తున్నారు. చీఫ్‌ లిక్కర్‌ పోసి ఓట్లు అడిగే స్థాయికి బీజేపీ దిగజారిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు.

Also Raed:

Balineni Srinivasa Reddy: టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదం.. వంగవీటిపై మంత్రి బాలినేని కామెంట్స్

Vangaveeti: వంగవీటి రాధ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఐసీయులో ఉన్న వ్యక్తి రెక్కీ ఎలా చేశారు?