AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన.. పాతబస్తీలోని పలు అభివృద్ది పనులకు శ్రీకారం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్‌ అలి, లోకల్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో కలిసి గల్లీ గల్లీ తిరిగారు.

Minister KTR: హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన..  పాతబస్తీలోని పలు అభివృద్ది పనులకు శ్రీకారం
Ktr
Balaraju Goud
|

Updated on: Apr 19, 2022 | 1:16 PM

Share

 Inaugurates Bahadurpura Flyover: విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహుదూర్‌పురాలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీతో కలిసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. మంగళవారం పాతబ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత బహుదూర్‌పురా ఫ్లైఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం రూ.495 కోట్ల విలువైన 6 పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌, ముర్గీ చౌక్‌, మీర్‌ ఆలం మార్కెట్‌ పునర్‌ నిర్మాణం, చార్మినార్‌లోని సర్దార్‌ మహల్‌ రీస్టొరేషన్‌, కార్వాన్‌ నియోజకవర్గంలో సీవరేజ్‌ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మీర్‌ ఆలం చెరువు వద్ద మ్యూజికల్‌ ఫౌంటెన్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ నిజాం కాలం నాటి మొజంజాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజు సర్దార్‌ మహల్‌ పనులు ప్రారంభించామన్నారు. రూ.109కోట్లతో బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ నిర్మించినట్లు మంత్రి తెలిపారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలున్నాయని.. హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కి ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు పూర్వవైభవం తెస్తామన్నారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలి, లోకల్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో కలిసి గల్లీ గల్లీ తిరిగారు. లోకల్‌లో కనిపించిన సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రోడ్డు వెంటన ఉన్న కూలీలను చూసి ఆగిన మంత్రి కేటీఆర్‌.. వారి బాగోగులను తెలుసుకున్నారు.