కేంద్రం వడ్లు కొనుగోలు చేసేంతవరకు ఊరుకునేది లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) మరోసారి వెల్లడించారు. ధాన్యం కొనుగులు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వన్న మంత్రి.. ఉద్దేశ్య పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందులు పెడుతుందోని ఆక్షేపించారు. కార్పొరేట్ లకు పక్షపాతిగా వ్యవహరిస్తున్న బీజేపీ(BJP) కి పేదలు, కార్మికులు అంటే పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కార్.. రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రంలో ధాన్యం(Paddy) కొనుగోలు చేయిస్తామని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు రైతులందరూ ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి ఒక్క పిలుపు ఇస్తే వేల మంది రైతులు వచ్చారు. రైతుల పక్షణ పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా రైతులు విజయం సాధిస్తారు. పంజాబ్ లో వడ్లు కొన్నట్లే తెలంగాణలోనూ వడ్లు కొనాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ బడా బడా పరిశ్రమ యజమానులకు వత్తాసు పలుకుతోంది. అచ్చేదిన్ అచ్చేదిన్ అన్న బీజేపీ నేడు సచ్చేదిన్ అనేలా చేస్తోంది. ధరలు పెంచడం తప్ప, తగ్గించడం బీజేపీ ప్రభుత్వానికి తెలియదు. రైతుల కోసం అన్ని చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసింది. ఉచిత కరెంట్ ఇచ్చేందుకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. అబద్ధాలు ఆడడం తప్ప నిబద్దత తెలియని పార్టీ బీజేపీ పార్టీ. మోడీ అంటే మోదుడు..బీజేపీ అంటే బాదుడు.. గత 14 రోజుల నుండి పెట్రోల్ పెరుగుతూనే ఉంది. పేదవాడు బతికే పరిస్థితి లేదు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవడం లేదు.
– హరీశ్ రావు, తెలంగాణ మంత్రి
బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. 16 లక్షల 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ రైతుల లాగా మన రైతులు కూడా విజయం సాధించాలని కోరారు. కరెంట్ కోతలు లేకుండా రైతులకు విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని స్పష్టం చేశారు.
Also Read
Shraddha Srinath: ఊహించని రెండు అనుభవాలతో షాక్ తిన్న జెర్సీ భామ.. అవేంటంటే
భార్యను బండిలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన వృద్ధుడు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి