Guntakandla Jagadish Reddy: తెల్లవారితే శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. అనారోగ్యంతో తండ్రి చనిపోగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండె పొటుతో కుప్పకూలాడు. దీంతో ఇద్దరు కుమార్తెలు ఉన్న ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి పోయింది. ఆత్మకూర్ ఎస్ మండలం నంద్యాల గూడెం గ్రామానికి చెందిన నంద్యాల వెంకట్ రెడ్డి- శోభ దంపతులు. వెంకట్ రెడ్డి హైదరాబాద్ చిరు ఉద్యోగాన్ని చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. వారికి ఇద్దరు కుమార్తెలు.. కాగా పెద్ద కూతురు శ్రావ్య నిచ్చితార్థం.. తెల్లవారితే అనగా సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కరించింది. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యంతో వెంకట్ రెడ్డి తండ్రి సత్తి రెడ్డి మరణించగా.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక పోయిన వెంకట్ రెడ్డి గుండె పోటుతో తనువు చాలించాడు. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది.
ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డి
తండ్రి కుమారులు చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. నంద్యాలగూడెం చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించడంతో పాటు ఓదార్చి అండగా నిలబడతానని హామీనిచ్చారు. విషాదంతో ఆగిపోయిన వెంకట్ రెడ్డి కూతురు శ్రావ్య వివాహాన్ని తానే జరిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ తో అంధకారంలో ఉన్న కుటుంబంలో మంత్రి జగదీష్ రెడ్డి వెలుగులు నింపారు. వెంకటరెడ్డి కుటుంబసభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఆయన కూతురు శ్రావ్య వివాహాన్ని జరిపించారు. ఈ రోజు సూర్యాపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో శ్రావ్యా వివాహం ఉదయం 9:30 నిమిషాలకు వైభవంగా జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి -సునీత దంపతులు వివాహాన్ని దగ్గరుండి జరిపించి నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ఔదార్యానికి గ్రామస్థుల ఫిదా..
ఆపదలో ఉన్న కుటుంబం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు చూపిన ఔదార్యానికి నంద్యాల గూడెం వాసులతో పాటు బంధు మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలు, జెండాలు చూసి తనకు ఎదో ఒక ఉపయోగం లేనిదే సహాయం చేయని నేటి రోజుల్లో.. చిరు ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచిన జగదీష్ రెడ్డికి అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read: