తెలంగాణలో బతుకమ్మ సందడి షూరు అయ్యింది. ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా సాగుతోంది. చీరల పంపిణిలో మంత్రి ఎర్రబెల్లి.. కోలాటం ఆడి, స్టేపులు వేసి ఊత్సాహాపరిచారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం మొదలైంది. కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈసారీ మల్టీపుల్ కలర్స్ లో చీరల పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరపాలని, ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలను గౌరవించుకుంటూ పుట్టింటి సారెగా రూ 333.14 కోట్లతో బతుకమ్మ చీరలను రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించాలని, చేనేత పరిశ్రమకు చేయూత అందివ్వాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం వెలికట్టలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మినిస్టర్ మహిళలకు చీరలను, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, స్వయం సహాయక మహిళలకు 7 కోట్ల రూపాయల లోన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ సీఈఓ రమాదేవి.. స్థానిన నాయకులు పాల్గొన్నారు.
Also Read: