Telangana: హైదరాబాద్ రెస్టారెంట్ అసోసియేషన్లకు మంత్రి స్వీట్ వార్నింగ్..

హైదరాబాద్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని.. హైదరాబాద్ బిర్యానీకి ఓ చరిత్ర ఉందన్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ. ఆహారాన్ని కల్తీ చేసి సిటీ పరువు తీయొద్దని హోటల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. గత నెల నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ కమిషన్ అధికారులు సోదాను నిర్వహించారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పాడైన పదార్ధాలు, కల్తీ వస్తువులతో వండుతున్నట్లు తెలిసింది.

Telangana: హైదరాబాద్ రెస్టారెంట్ అసోసియేషన్లకు మంత్రి స్వీట్ వార్నింగ్..
Damodara Rajanarsimha

Updated on: Jun 12, 2024 | 10:24 AM

హైదరాబాద్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉందని.. హైదరాబాద్ బిర్యానీకి ఓ చరిత్ర ఉందన్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ. ఆహారాన్ని కల్తీ చేసి సిటీ పరువు తీయొద్దని హోటల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఆహారాన్ని కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. గత నెల నగరంలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ కమిషన్ అధికారులు సోదాను నిర్వహించారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పాడైన పదార్ధాలు, కల్తీ వస్తువులతో వండుతున్నట్లు తెలిసింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. హోటల్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హోటల్ అసోషియేషన్ ప్రతినిథులు గతంలో ఒక సామావేశం ఏర్పాటు చేసి హైజిన్ నిర్వహించడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే తాజాగా సిటీలోని ప్రముఖ హోటల్స్ అసోసియేషన్లతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‎లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి.. కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఆహార కల్తీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. కానీ ఫుడ్ సెఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న అంశాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతున్నామని.. ఈ క్రమంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులకు తెలియజేశారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్‌ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూల స్పందించారు. హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నాసిరకం ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని కూడా నిర్వాహకులు నాశనం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం, ఇతర వస్తువులను వంటల్లో వినియోగిస్తూ కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న దృశ్యాలు అంతా విస్తుపోయేలా చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. భవిష్యత్తులో ఆహారాన్ని కల్తీ చేస్తే సహించబోమని హోటల్ నిర్వాహకులను హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…