Telangana: బరి తెగించిన లోన్‌యాప్‌ నిర్వాహకులు.. వివాహిత ఫోటోలు మార్పింగ్ చేసి.. అవమానం తట్టుకోలేక

|

May 18, 2022 | 8:34 PM

మంచిర్యాల జిల్లాలో లోన్‌ యాప్‌ వేధింపులకు ఓ వివాహిత బలైంది. యాప్‌ నిర్వాహకుల వేధింపులను తాళలేక కళ్యాణి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

Telangana: బరి తెగించిన లోన్‌యాప్‌ నిర్వాహకులు.. వివాహిత ఫోటోలు మార్పింగ్ చేసి.. అవమానం తట్టుకోలేక
Loan App Harassment
Follow us on

Loan app harassment: లోన్‌యాప్‌ నిర్వాహకులు బరితెగించారు. ఎంతలా అంటే బాధితురాలి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి మరీ డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వేధింపులు భరించలేక ఓ బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల(Mancherial)లోని గోపాలవాడ(Gopalwada)కు చెందిన బొల్లు కళ్యాణి అనే వివాహిత లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లోన్ యాప్ లో 30 వేల రుణం తీసుకుంది కళ్యాణి అనే మహిళ. అయితే గడువులోగా చెల్లించకపోవడంతో పోన్ లో బెదిరించారు లోన్ యాప్ నిర్వాహకులు. అంతేకాదు మహిళ న్యూడ్ పోటోలను పంపి డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అవమాన భారంతో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది బాధితురాలు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. అయినా యాప్ నిర్వహకుల బెదిరింపులు ఆగకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు. అయితే కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నా బెదిరింపులు ఆపలేదు లోన్‌యాప్‌ నిర్వాహకులు. మృతదేహం పోటో పంపాలంటూ డిమాండ్ చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.