Man Commits Suicide: ఇటీవల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా(khammam District) ఏదులాపురంలో అనారోగ్యంతో తీవ్ర మనస్తాపం చెందిన మరో వ్యక్తి సూసూడ్ చేసుకున్నాడు. అయితే అతడు ఊహించని విధంగా జీవించి ఉండగానే తన ఫొటో వద్ద కీర్తిశేషులు అని రాసిపెట్టుకున్నాడు. దానికి పూజలు కూడా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు(Tamil Nadu) చెందిన శివప్రసాద్(48) అనే వ్యక్తి ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణకు వలసొచ్చాడు. కొంతకాలం విజయవాడలోనూ.. ఆపై ఖమ్మంలోనూ ఉన్నాడు. అనంతరం ఖమ్మం దగ్గర్లోని ఏదులాపురం వెంపటినగర్‌లో ఓ ఇళ్లు రెంట్‌కు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. సమీపంలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1న తర్వాత శివప్రసాద్ కనిపించలేదు. దీంతో అనుమానం రావడంతో ఇంటి యజమాని అతడి గది వద్దకు వెళ్లి తలుపు కొట్టినా తీయలేదు. పిలిచినా నో రెస్పాన్స్. దీంతో కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. దీంతో ఇంటి ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడకు వచ్చి మృతదేహాన్ని ఖమ్మం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివప్రసాద్ కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధకు తాళలేక చావే శరణ్యమనుకున్నాడు. తన ఫొటో ప్రేమ్ కట్టించుకుని.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
Also Read: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్..