Telangana: శుభకార్యంలో విషాదం.. గొంతులో మాసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

చికెన్, మటన్, ఫిష్.. ఇలా నాన్-వెజ్ ఏదైనా చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. మాంసం కూర వండతున్న వాసన వస్తేనే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి.

Telangana: శుభకార్యంలో విషాదం.. గొంతులో మాసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి
Mutton Curry

Updated on: Nov 10, 2021 | 6:54 PM

చికెన్, మటన్, ఫిష్.. ఇలా నాన్-వెజ్ ఏదైనా చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. మాంసం కూర వండతున్న వాసన వస్తేనే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇకపై కూర ఉడకగానే.. చాలామంది ఆవురావుమంటూ వేడివేడిగా తినేస్తారు. అయితే మాంసం తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని తాజా ఘటన ఉదహరిస్తుంది.  గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి పంచాయతీలోని చేదు గుట్ట తండాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తండాలోని చుట్టాల ఇంట్లో పంక్షన్‌కు వెళ్లిన చంద్రు నాయక్(59).. మంగళవారం రాత్రి తొమిద్దిన్నర సమయంలో విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక కాసేపు అల్లాడిపోయాడు. ఎంత ప్రయత్నించినా.. ఆ ముక్క బయటకూ రాలేదు.. అటు కడుపులోకి వెళ్లలేదు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పరీక్షించిన డాక్టర్లు.. చంద్రు నాయక్​ చనిపోయినట్లుగా నిర్థారించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also Read: Mahesh Babu: “మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా”.. మహేశ్ బాబు ట్వీట్

విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌