వనపర్తి, మార్చి 1: మరణం ఎప్పుడు.. ఎలా.. ఏ వైపు నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కాలం కలిసిరాక పోతే అరటి పండు తిన్నా ఐసీయూకి వెళ్లవల్సి వస్తుంది. హాయిగా నవ్వుతూ గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో..! రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ హఠాత్తుగా కుప్పకూలిపోవడమో.. ఎదురుగా వచ్చే వాహనం రూపంలోనో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యం కారణం గానో.. ఈ రోజుల్లో ఏ రూపంలో ఎటునుంచి మృత్యువు మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలు కూడా మన పాలిట మృత్యు కుహరాలు అవుతాయి. అలాంటి ఓ సంఘటన తాజాగా వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వీధి పక్కన చిన్న బజ్జీ కొట్టులో తనకు ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీ తీసుకున్న ఓ వ్యక్తి.. ఆబగా దానిని తినబోయాడు. ఇంతలో అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక చనిపోయాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్య (39) అనే వ్యక్తికి బజ్జీలు అంటే మహా ఇష్టం. బుధవారం సాయంత్రం తిరుపతయ్య తన ఇంటి ఎదుట కూర్చొని కోడిగుడ్డు బజ్జీలు తింటున్నాడు. ఇంతలో బజ్జీ గొంతులో ఇరుక్కుపోయింది. దానిని బయటికి తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ బయటికి రాకపోవడంతో ఊపిరాడక తిరుపతయ్య కిందపడిపోయాడు. భర్త కిందపడిపోవడం గమనించిన అతని భార్య సువర్ణ బజ్జీని తీసేందుకు ప్రయత్నించింది. అయినా అది రాలేదు. మరి కొద్దిసేపటికే చుట్టుపక్కల వారు వచ్చి, తిరుపతయ్య గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీని ఏదోలా కష్టపడి తీయగలిగారు. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఊపిరాడక తిరుపతయ్య మృతి చెందాడు. తన కళ్ల ముందు భర్త ప్రాణాలు వదలడం తట్టుకోలేక భార్య సువర్ణ గుండెలవిసేలా రోధించింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
గుంటూరులో మరో ఘటన: ట్రాక్టర్-కారు ఢీ.. ముగ్గురు మృతి!
గుంటూరులో ఘర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం (మార్చి ) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంల ప్రాణాలు కోల్పోయిన మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/telangana
1192852,1192838,1192859,1192966