KTR With Bill Gates: ఐటీతో పాటు, బయోలాజికల్ హబ్ గా తెలంగాణ.. బిల్ గేట్స్ కు వివరించిన మంత్రి కేటీఆర్..

|

Feb 25, 2022 | 5:29 PM

బయో ఏసియా-2022 కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రపంచ దేశాలకు తక్కువ ఖర్చులో వ్యాక్సిన్లను(Low Cost Vaccine) అందింస్తున్న తీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్ తో బిల్ గేట్స్ మాట్లాడారు.

KTR With Bill Gates: ఐటీతో పాటు, బయోలాజికల్ హబ్ గా తెలంగాణ.. బిల్ గేట్స్ కు వివరించిన మంత్రి కేటీఆర్..
Ktr In Bio Asia 2022
Follow us on

KTR With Bill Gates: బయో ఏసియా-2022 కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ ను కొనియాడారు. ప్రపంచ దేశాలకు తక్కువ ఖర్చులో వ్యాక్సిన్లను(Low Cost Vaccine) అందింస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. భారత్ కరోనా మహమ్మారిని(Covid-19) పారద్రోలడంలో ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు 15 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ అందించటాన్ని బిల్ గేట్స్ తన ప్రసంగంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బిల్ గేట్స్ తో మాట్లాడారు. ఐటీతో పాటు, బయోలాజికల్ హబ్ గా తెలంగాణ అద్భుతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అనుమతి పొందిన వ్యాక్సిన్ తయారీ యూనిట్లు తెలంగాణ కేంద్రంగా ఉన్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రంపంచ దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీలో ధనిక దేశాల కంటే భారత్ అత్యుత్తమంగా కృషి చేసిందని బిల్ గేట్స్ అభినందించారు. ఇంతకీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిల్ గేట్స్ తో ఏం మాట్లాడారో ఈ ట్వీట్ లో మీరే చూడండి.

టెక్నాలజీ సహకారంతో మహమ్మారి విజృంభించిన సమయంలో ఆరోగ్య సేవలు అందించటం.. ఆసుపత్రులపై, డాక్టర్లపై ఒత్తిడిని తగ్గించినదంని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వైరస్ లతో వచ్చే మహమ్మారుల గురించి తాను ఒక పుస్తకం రాస్తున్నట్లు బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ మహమ్మారి నుంచి ఆరోగ్యంపై చూపాల్సిన శ్రద్ధ గురించి అందరూ నేర్చుకున్నారని ఆయన అన్నారు.

Also read..

Airtel: బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోకి టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. సింగపూర్ సంస్థలో పెట్టుబడులు..

Stock Market: స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్ల ట్రేడింగ్ ఎందుకు నిషేధిస్తారు.. దీని వెనుక అసలు కారణం ఏమిటి..