Telangana Inter Exams: కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తాజాగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడితే జూన్ నెలాఖరున సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని.. లేని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఒకవేళ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు క్యాన్సిల్ అయితే.. మొదటి సంవత్సరం పరీక్షలు ఆధారంగా వారికి మార్కులు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామని సందీప్ కుమార్ చెప్పినట్లు సమాచారం. గతంలోనే ఇంటర్ బోర్డు ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన సంగతి తెలిసిందే. కాగా, ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. జూన్ 1న కరోనా పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన విషయం విదితమే.
Also Read:
ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..
గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!
SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!