Telangana Inter Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పరీక్షలను మే 2 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెబుతూ వచ్చిన ఇంటర్ బోర్డు.. కరోనా మహమ్మారి కారణంగా ఆఫ్ లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ఇక థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు మే నెలలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇక మరోవైపు ఇంటర్ మొదటి సంవత్సరంలో 2.35 లక్షల మంది విద్యార్థులు పెయిల్ కాగా, ప్రభుత్వం పాస్ మార్కులు వేసి ఉత్తీర్ణులయ్యేలా చేసింది. పాస్ మార్కులతో సంతృప్తి పడని విద్యార్థులు బెటర్‌మెంట్ రాసే అవకాశాలున్నాయి. ఇక ఒత్తిడితో ఉన్న విద్యార్థులు ఒక రోజు ఫస్టియర్, మరుసటి రోజు సెకండియర్ పరీక్షలు రాయలంటే ఆందోళనకు గురవుతున్నారు. కనీసం సబ్జెక్టుల మధ్య రెండు రోజుల సమయమైనా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: