Telangana: వారికి ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఆ రూల్ లేనట్టే.!

గ్యాప్ ఉన్నవారు, గ్రూప్ మార్చుకోవాలనుకునేవారు, అదనపు సబ్జెక్టు రాయాలనుకునేవారికి భారీ ఉపశమనం లభించనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Telangana: వారికి ఎగిరిగంతేసే వార్త.. తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఆ రూల్ లేనట్టే.!
Students

Edited By:

Updated on: Dec 11, 2025 | 12:34 PM

తెలంగాణ ఇంటర్ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) మార్చి 2026లో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులకు (కాలేజీ స్టడీ లేకుండా హాజరయ్యే విద్యార్థులు) హాజరు శాతం మినహాయింపు ఇస్తు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ హాజరు మినహాయింపు వర్తించే అభ్యర్థులు:

1. కేవలం ఆర్ట్స్/హ్యుమానిటీస్ గ్రూప్ సబ్జెక్టులతో ప్రైవేట్‌గా రాస్తున్న అభ్యర్థులు

2. గ్రూప్ మార్చుకోవాలనుకునే అభ్యర్థులు (Science to Arts/Humanities)

ఇవి కూడా చదవండి

3. ఇప్పటికే 1st ఇయర్ & 2nd ఇయర్ ఇంటర్మీడియట్ ఒకే సబ్జెక్టుతో పాసై అడ్డిషనల్ సబ్జెక్ట్ కోసం రాసే అభ్యర్థులు

4. B.P.C గ్రూప్‌తో ఇంటర్ పాసై మ్యాథమెటిక్స్‌ను అదనపు సబ్జెక్టుగా రాయాలనుకునే విద్యార్థులు

ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ / ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు 1వ ఇయర్ నుంచి (IPE మార్చి 2024 బ్యాచ్), 2వ ఇయర్ నుంచి (IPE మార్చి 2025 బ్యాచ్) అమలులోకి వస్తాయి. హాజరు మినహాయింపు పొందాలంటే రూ.500/- ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తును ఆలస్య రుసుముతో సహా 12 డిసెంబర్ 2025 నాటికి సమర్పించాలి. ఈ మినహాయింపు మార్చి 2026 ఇంటర్ పరీక్షలకు మాత్రమే వర్తిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేట్ అభ్యర్థులకు ఈ సడలింపు భారీ ఉపశమనం కలిగించనుండగా, వేలాది మంది విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది.

హాజరు మినహాయింపు అభ్యర్థులకు ముఖ్య అర్హతలు & నియమాలు:

1. ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నవారు: SSC లేదా ఇంకో బోర్డు ఇంటర్ పాసై ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నవారు 1వ ఇయర్ & 2వ ఇయర్ రెండూ రాయవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల గ్యాప్ ఉంటే కూడా రెండు సంవత్సరాలు రాయొచ్చు.

2. గ్రూప్ మార్చుకునేవారు: సైన్స్ నుంచి ఆర్ట్స్ / హ్యుమానిటీస్ గ్రూప్‌కు మారాలనుకునేవారు “Exemption from Attendance” రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

3. అదనపు సబ్జెక్టు (Additional Subject): ఇప్పటికే 1st & 2nd ఇయర్ పూర్తి పాసైనవారు రెండో భాషగా ఏ సబ్జెక్టు రాయవచ్చు.

4. BPC గ్రూప్‌తో పాసై మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్టుగా రాయాలనుకునేవారు కూడా అర్హులే.

5. ఇతర రాష్ట్ర/బోర్డు నుంచి వచ్చినవారు: తెలంగాణ బోర్డుకు ఈక్వివలెంట్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఆన్‌లైన్ దరఖాస్తులో స్కాన్ చేసిన కాపీ అప్‌లోడ్ చాలి.

6. దరఖాస్తుతో పాటు ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC), ఈక్వివలెంసీ సర్టిఫికెట్ (ఒకవేళ ఇతర బోర్డు నుంచి వస్తే) స్కాన్ చేసి ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి.

ఈ నిర్ణయంతో గ్యాప్ ఉన్నవారు, గ్రూప్ మార్చుకోవాలనుకునేవారు, అదనపు సబ్జెక్టు రాయాలనుకునేవారికి భారీ ఉపశమనం లభించనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు త్వరగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..