TS Inter Admissions 2023: తెలంగాణలో ఇంటర్‌ 2023-24 ప్రవేశాలు ప్రారంభం.. జూన్ 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

|

Jun 02, 2023 | 1:31 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. టెన్త్‌ పాసైన విద్యార్ధులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూన్ 1న నుంచే విద్యార్థుల ప్రవేశాలతో..

TS Inter Admissions 2023: తెలంగాణలో ఇంటర్‌ 2023-24 ప్రవేశాలు ప్రారంభం.. జూన్ 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
TS Inter Admissions 2023
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. టెన్త్‌ పాసైన విద్యార్ధులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూన్ 1న నుంచే విద్యార్థుల ప్రవేశాలతో సందడి నెలకొంది. కార్పొరేటు కళాశాలలకు విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కాలేజీల వద్దకు వచ్చారు.

మరోవైపు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో తక్కువ మార్కులతో ఫెయిలైన విద్యార్థులపై జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు దృష్టి సారించారు. ఒకట్రెండు మార్కులతో 2,3 సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్ధులు నాలుగు వేలకుపైగా ఉన్నట్లు తెలిపారు. వారంతా అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి ఒడ్డెన్న ప్రిన్సిపాళ్లతో సమావేశమై గురువారం సమీక్ష నిర్వహించారు.

ఇంటర్ విద్యార్ధులకు సైన్స్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు సబ్జెక్టుల పరీక్షలు 12 నుంచి 20 వరకు జరుగుతాయి. 21న నైతిక విలువలు, 22న పర్యావరణ పరిరక్షణ పరీక్షలుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.