ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లి గ్రామ శివారులో జరిగింది. ఊరి చివర పాండవుల గుట్టపై నిధి వుందని గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. వారిలో ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు గ్రామస్థులు.
వివరాల్లోకి వెళ్తే.. ఊరి చివర పాండవుల గుట్టపై పూర్వం రాజులు సంచరించే వారిని ప్రచారంలో ఉంది. చాలామంది ఈ గుట్టపై గుప్తనిధులు వున్నాయని నమ్ముతుంటారు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిధుల వేటలో నిమగ్నమయ్యారు.. ఈ ప్రాంతానికి రాగానే తనలో ఏదో శక్తి ఆవహించి నిధికి దారి చూపిందని ఊరి ప్రజల కంటపడకుండా గుట్టపైకి చేరుకున్నారు.. నిధి ఉందనే భావనతో అక్కడ పూజలు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు..
ఈ విషయం గమనించిన స్థానికులు ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.. ఈ తవ్వకాల వెనుక మరికొందరు పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు.. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఆ వ్యక్తులు ఎవరూ..? ఎక్కడి నుండి వచ్చారు..?వారికి ఇక్కడ సహకరించింది ఎవరనేది గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు నిధి దొరికిందా.? లేదా..? ఆవహించిన దేవుడు నిధి ఉందని చెప్పాడు కానీ.. దొరికితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారని చెప్పలేదా అని చర్చ జరుగుతుంది..