Safety City Hyderabad: ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు.. ఏం జరిగిందా అని తెలుసుకునేలోపు..

|

Dec 17, 2022 | 9:29 AM

హైదరాబాద్‌ మహానగరంలో నగరం నడ్డిబొడ్డున ఉండే ప్రాంతమది. ఎంతో మంది శ్రామికులు, వేతన జీవులు నివాసముండే ప్రాంతం కూడా.. కొంత మాస్ అయినా.. ప్రశాంతంగా ఉండే ఏరియా ఒక్కసారిగా వందలాది మంది..

Safety City Hyderabad: ఒక్కసారిగా వందలాది మంది పోలీసులు.. ఏం జరిగిందా అని తెలుసుకునేలోపు..
Hyderabad Police Conduct Cordon Search Operation (file Photo)
Follow us on

హైదరాబాద్‌ మహానగరంలో నగరం నడ్డిబొడ్డున ఉండే ప్రాంతమది. ఎంతో మంది శ్రామికులు, వేతన జీవులు నివాసముండే ప్రాంతం కూడా.. కొంత మాస్ అయినా.. ప్రశాంతంగా ఉండే ఏరియా ఒక్కసారిగా వందలాది మంది పోలీసులతో నిండిపోయింది.. చుట్టుపక్కల ప్రజలకు తమ పరిసరాల్లో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. రాత్రి వరకు బాగానే ఉంది కదా.. ఇంతలోనే ఏమైందబ్బా అనే చర్చ మొదలైంది. పోలీసులంతా బిజీబిజీగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలను చెక్‌ చేస్తున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా పోలీసులు అక్కడే మోహరించారు. పొద్దునే నిద్రలేచి.. ఒక్కసారి బయటకు చూస్తే ఆ ప్రాంతంలో పోలీసులే కన్పిస్తున్నారు. తెల్లవారుజామున ఖాళీగా ఉండే ప్రాంతంలో పోలీసులు ఎందుకు వచ్చారో అర్థం కాక.. చుట్టుపక్కల వారికి ఫోన్లు చేసి ఏం జరిగింది.. అక్కడ అంతా పోలీసులే ఉన్నారని అడుగుతున్నారు. ఏమో నాకు అంతా గందరగోళంగా ఉంది.. ఏమైందో ఏంటో అర్థం కావడం లేదనే సమాధానం వస్తుంది. ఇలా అసలు విషయం మాత్రం ఎవరినోట రావడం లేదు. అయితే కాసేపటి తర్వాత.. పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ రోజులాగే ఆ ప్రాంతం మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. అదేనండి పోలీసులు చింతలబస్తీ వీర్‌ నగర్‌లో కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని చింతలబస్తీ వీర్ నగర్ లో సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వరంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటలనుంచి శనివారం ఉదయం 5గంటల 30 నిమిషాల వరకు జరిగిన ఆపరేషన్ లో సరైన పత్రాలు లేని 70 వాహనాలు సీచ్ చేశారు సెంట్రల్ జోన్ పోలీసులు. కమిషనర్‌ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఈ ఆపరేషన్ నిర్వహించామని సెర్చ్ ఆపరేషన్ లో ఓ పాత నేరస్థుడ్ని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. అక్రమ మద్యం, గ్యాస్ సిలెండర్స్ ను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలో ఇలాంటి కార్డన్‌ సెర్చ్ నిర్వహించడం కొత్త కాదు. చాలా ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులంతా అధిక సంఖ్యలో ఓ ప్రాంతానికి చేరుకుని.. ఆ ఏరియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులుంటే గుర్తించేందుకు ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..