Bodhan Issue: నిజామాబాద్ జిల్లా బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ.. రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, నిజామాబాద్ కమీషనర్ కేఆర్ నాగరాజుతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని హోం మంత్రికి డీజీపీ వివరించారు. ఉద్రిక్తత లకు దారితీసిన పరిస్థితులపై హోం మంత్రి ఆరా తీశారు. అయితే, ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని మంత్రికి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని కులాలు, అన్ని మతాలు సమానమేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఆ దిశగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అన్ని మతాలకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ సెక్యూలర్ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందని పేర్కన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని.. ప్రజలు పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
Also read:
Putin Dress: ‘వార్’లోనే కాదు.. ‘వేరింగ్’లోనూ ‘తగ్గేదే లే’ అంటున్న పుతిన్.. 10 లక్షల విలువైన..
Stretch Marks: స్ట్రెచ్ మార్కులతో ఇబ్బందులు పడుతున్నారా? తేనె తో ఇలా చెక్ చెప్పండి..!