Telangana: ఫామ్‌హౌస్ డీల్‌ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు.. పోలీసుల దర్యాప్తునకు అనుమతి..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫామ్‌హౌస్ డీల్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో..

Telangana: ఫామ్‌హౌస్ డీల్‌ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు.. పోలీసుల దర్యాప్తునకు అనుమతి..
Telangana High Court

Updated on: Nov 08, 2022 | 5:17 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫామ్‌హౌస్ డీల్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ.. మొయినాబాద్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయొచ్చని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల ఎర కేసు తెలంగాణలో సంచలన సృష్టించిన విషయం విదితమే.

మరోవైపు ఫామ్‌హౌస్ డీల్‌ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్.. మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. ఇక ఇవాళ జరిగిన విచారణలో కేసు దర్యాప్తును నిలిపి వేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు ఎక్కువ రోజులు నిలిపివేయడం మంచిది కాదని ఈ మేరకు ధర్మాసనం పేర్కొంది.

దీంతో ఈ కేసులో పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేసేందుకు మార్గం సుగుమమైంది. అటు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టింది తెలంగాణ హైకోర్టు. పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సి అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.