Vanama Venkateshwara Rao: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని స్పష్టంచేసింది. దీంతోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్ ను ప్రకటించింది. ఎన్నికలవేళ తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు నిర్దారించిన.. ధర్మాసనం రూ.5లక్షలు జరిమానా విధించింది. అయితే, ఎన్నికలప్పుడు అఫిడవిట్‌లో సమర్పించిన కేసులు, ఆస్తులు అబద్దాలని తేల్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వనమా..ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన జలగం వెంకట్రావు.. వనమా అఫిడవిట్‌పై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జలగం వెంకట్రావు పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని.. తీర్పునిచ్చింది.
వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేకు అనర్హుడని.. 2018 డిసెంబర్ 12 నుంచి సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యే గా గుర్తించాలని తెలంగాణ ధర్మాసనం తీర్పులో వెలువరించింది. వనమా వెంకటేశ్వరరావు తన భార్య పేరు ఉన్న ఆస్తులను ప్రకటించకపోవడంతో జలగం వెంకట్రావు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ తో పాటు సమర్పించాల్సిన ఫామ్ 26 కు సంబందించిన వివరాలను వనమా సమర్పించలేదు. భార్య పేరు మీద ఉన్న ఆస్తులు అఫిడవిట్లో ఉన్న వనమా మెన్షన్ చెయ్యలేదు. కాగా.. వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా.. బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..