Telangana Weather: వాన వదలడం లేదు. వరద పోటెత్తుతోంది. అక్కడా ఇక్కడా అని లేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. ఆల్మోస్ట్ వారం అవుతుంది ఎండను చూసి.. తెలంగాణను ముసురు వీడట్లేదు. ఏ జిల్లాలో చూసినా ఏరులై పారుతున్న వరదనీరే దర్శనమిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వర్షాలు తగ్గకపోవడంతో విద్యాసంస్థలకు మరో మూడ్రోజులు సెలవులు పొడగించింది ప్రభుత్వం. సోమవారం స్కూల్స్ పునఃప్రారంభవుతాయని ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్(CM KCR).. అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో గురువారం, శుక్రవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం తీవ్ర అల్పపీడనం బలహీనపడి గురువారం ఉదయం అల్పపీడనంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లోని ప్రజలకు మరికొద్ది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్(Hyderabad) వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, యాదగిరి, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లాల్లో మరికొద్ది గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారీ వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 14, 2022
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి