Weather Update: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసా?

Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Weather Update: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసా?
Weather Update

Updated on: Nov 04, 2025 | 4:50 PM

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆయా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని ఉపరితల ఆవర్తనం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిందని, ఈ కారణంగానే తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అంచనా వేసింది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. మంగళవారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది.

ఇక బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అధికారులు హెచ్చరించారు. కాబట్టి వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కల్లాల్లో ధాన్యం ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

తాజా వాతావరణ సూచనల కోసం ఈ లింక్‌ను క్లిక్  చేయండి

తెలంగాణ వార్తల కోసం