Minister Harish Rao: కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. కాగా, రెండో డోసు, ప్రికాషనరీ డోసు మధ్య ఉన్న గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్, ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నామని లేఖలో పేర్కొన్నా మంత్రి హరీష్ రావు. ఈ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఆయన విన్నవించారు.
Also read:
Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..