Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణాలోని అన్ని ఆసుపత్రిలో త్వరలో ఆ వైద్య సేవలు..

|

May 03, 2022 | 12:38 PM

Telangana: రోజు రోజుకీ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు సంఖ్య అధికమవుతోంది.. మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు ( Knee replacement surgeries) తప్పనిసరి అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ మోకాలి చిప్పలు..

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణాలోని అన్ని ఆసుపత్రిలో త్వరలో ఆ వైద్య సేవలు..
Finance Minister Harish Rao
Follow us on

Telangana: రోజు రోజుకీ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు సంఖ్య అధికమవుతోంది.. మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు ( Knee replacement surgeries) తప్పనిసరి అవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్లు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి మాత్రమే పరిమితమయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్లను ప్రారంభించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేపించుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరిశ్ రావు మాట్లాడుతూ.. మోకాలి చిప్పలు మార్పిడి శస్త్రచికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ప్రారంభించనున్నామని తెలిపారు.

ఇక నుంచి ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట  ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు.  బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు.  ప్రభుత్వ ఆసుపత్రిలపై రోగులకు భయం పోయి దైర్యం, నమ్మకం కలిగిందని అన్నారు. ఒకప్పుడు మోకాలి మార్పిడి ఆపరేషన్ డబ్బులు ఉన్నవాళ్ళకి మాత్రమే చేసుకునే ఖరీదైన వైద్యమని .. ఇప్పుడు నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద వాళ్లకు ఈ చికిత్సను  అందుబాటులోకి తెచ్చామని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుకున్నారని.. అదే నేడు అమలు అవుతున్నాయని చెప్పారు.

ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 30శాతం డెలివరీ లు అవుతే నేడు 56శాతం అవుతున్నాయి. సీఎం కేసిఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేయడం వల్లనే ఈ సర్జరీలు సాధ్యం అవుతున్నాయి. సుమారు ఈ సర్జరీ లకు 5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. సర్జరీ చేయడం వల్ల వారికి పునర్ జన్మ ఇచ్చామని తెలిపారు. మోకాళ్ల నొప్పులతో ప్రతి 10 మందిలో ఇద్దరు బాధపడుతున్నారు.. కనుక ఇక నుంచి సిద్ధిపేట ఆసుపత్రిలో వారానికి సుమారు 6గురికి మోకాళ్ల చిప్పలు మార్పిడి చేయనున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: PM Modi Visit: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ బిజీ.. యూరఫ్ తర్వాత నేపాల్, జపాన్‌ సందర్శించే అవకాశం

Travel Special: మీరు పక్షి ప్రేమికులా.. ఓఖ్లా పక్షుల అభయారణ్యం బెస్ట్ ఎంపిక.. ఇక్కడ ఎన్ని రకాల పక్షులున్నాయో తెలుసా..

IPL 2022: ఒక రైతు కొడుకు ఐపీఎల్‌లో కోట్లు సంపాదిస్తున్నాడు.. పేదరికంలో పెరిగిన మరో ‘విరాట్‌’..!