నేడు తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం.. వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలపై చర్చించే అవకాశం..

|

Jun 17, 2021 | 9:25 AM

Telangana Ministers: తెలంగాణలో వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం

నేడు తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం.. వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలపై చర్చించే అవకాశం..
Minister Harish Rao
Follow us on

Telangana Ministers: తెలంగాణలో వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం నాడు బేటీ కానుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్యక్షుడుగా ఏర్పాటైన ఈ ఉపసంఘంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఉపసంఘం ఏర్పాటైన తరువాత భేటీ అవడం ఇదే తొలిసారి. కాగా, ఇవాళ జరగనున్న ఈ భేటీలో రాష్ట్రంలో వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్య సేవలు, వైద్య సేవల మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. అంతకుముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉండగా.. ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవి నుంచి ఈటెల ను తొలగించి.. ఆ పోర్ట్‌పోలియోను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, వైద్య ఆరోగ్య శాఖపై పర్యవేక్షనకు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించడంతో పాటు.. మంత్రి కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

Also read:

ఏటీఎంలో దొంగలు పడ్డారు.. సీసీ కెమెరాను పగలగొట్టారు.. ఇక అంతా ఓకే అనుకుంటే..ఆ గదిలో ఓ మూల వణుకు పుట్టించింది..