1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఈ పల్లెపోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థలు సైతం సత్తాచాటారు. కొన్ని చోట్ల ప్రజల తీర్పు సరిసమానంగా వచ్చిన పరిస్థితి ఉంటే.. మరికొన్ని చోట్ల కేవలం సింగిల్ డిజిట్ తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అభ్యర్థులు.

1,2,3,4 ఇవి ర్యాంకులు అనుకునేరు.. పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీలు.. ఎక్కడంటే!
Tg News

Edited By: Anand T

Updated on: Dec 15, 2025 | 4:24 PM

తెలంగాణలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. రాష్ట్రంలో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపు కేవలం సింగిల్ డిజిట్ మెజార్టీతోనే ఖాయం అయింది. నారాయణపేట్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు టెన్త్, ఇంటర్ ఫలితాల ర్యాంకుల మాదిరిగా వెలువడ్డాయి. 1,2,3,4 ఇలా మెజారిటీ ఓట్లతో అభ్యర్థులు సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు.

ఒక్క ఓటు మెజార్టీతో విజయం

మరికల్ మండలం పెద్దచింతకుంటలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ బలపరిచిన తిరుపతమ్మను విజయం వరించింది. సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వడ్ కాడంతో బీఆర్ఎస్ పార్టీ మద్ధతుతో పద్మ, కాంగ్రెస్ మద్దతుతో తిరుపతమ్మ బరిలో నిలిచారు. ఆదివారం జరిగిన ఓటింగ్ లో గ్రామస్థులు పద్మకు 604ఓట్లు వేయగా, తిరుపతమ్మకు 605ఓట్లు వేశారు. దీంతో ఒక్క ఓటు తేడాతో తిరుపతమ్మ విజయం సాధించారు. రీ కౌంటింగ్ చేసినా తిరుపతమ్మే విజయకేతనం ఎగురవేసింది.

రెండు ఓట్ల మెజార్టీతో విజయం

ఇక ధన్వాడ మండంలలోని మడిగేలా తండాలో కాంగ్రెస్ మద్ధతురాలు కేతావత్ మంగకు 343ఓట్లు రాగా, ఆమె అత్యంత సమీప ప్రత్యర్థి గీతకు 341ఓట్లు వచ్చాయి. దీంతో రెండు ఓట్ల తేడాతో కేతావత్ మంగ విజయ ఢంకా మోగించింది. ఇక ఇదే మండలంలోని తోళ్లగుట్ట తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కాంగ్రెస్ మద్ధతుతో బరిలోకి దిగిన రాందాస్ నాయక్ కు 200ఓట్లు, బీజేపీ బలపరిచిన పాండునాయక్ కు 197ఓట్లు పోలయ్యాయి. దీంతో 3 ఓట్ల తేడాతో రాందాస్ తోళ్లగుట్ట తండా ప్రథమ పౌరుడిగా ఎన్నికయ్యాడు.

నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం

ఇక పాతపల్లి గ్రామపంచాయతీలోనూ సర్పంచ్ ఫలితాలు హోరాహోరీగా సాగాయి. సీపీఐ మద్ధతు తెలిపిన పేరప్ప కేవలం 4 ఓట్ల మెజారీటితో విజయం సాధించాడు. సీపీఐ అభ్యర్థి పేరప్పకు 511 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 507ఓట్లు రావడంతో ఓటమి చవిచూశారు.

ఓట్ ఈజ్ మ్యాటర్,

ఓట్ ఈజ్ మ్యాటర్, ఒక్క ఓటు.. ఊరి తలరాతనే మార్చేస్తుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని గ్రామాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన నేతలకు బెటర్ లక్ నెక్ట్స్ టైం అంటున్నారట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.