Telangana: తెలంగాణలో ఉద్యోగ మేళా: నెరవేరుతున్న నిరుద్యోగుల ఆశలు

| Edited By: Ram Naramaneni

Sep 30, 2024 | 6:13 PM

గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారిగా డీఎస్సీ ద్వారా 7857 టీచర్ పోస్టులు భర్తీ చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల్లోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జులైలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేసి, దసరాకి ముందు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Telangana: తెలంగాణలో ఉద్యోగ మేళా: నెరవేరుతున్న నిరుద్యోగుల ఆశలు
CM Revanth Reddy
Follow us on

తెలంగాణలో నిరుద్యోగుల ఆశలు నెరవేరుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల మేళా ప్రారంభమైంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రక్షాళన చేసి, పెండింగ్‌లో ఉన్న పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తోంది.

మెగా డీఎస్సీ 2024 – పది నెలల్లోనే భారీ నియామకాలు

గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారిగా డీఎస్సీ ద్వారా 7857 టీచర్ పోస్టులు భర్తీ చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల్లోనే 11062 పోస్టులతో మెగా డీఎస్సీ 2024 నిర్వహించింది. జులైలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 30న విడుదల చేసి, దసరాకి ముందు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మెడికల్ అండ్ హెల్త్ బోర్డు – వరుస నోటిఫికేషన్లు

గడిచిన 15 రోజుల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసింది.
1. సెప్టెంబర్ 11న: 1,284 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు
2. సెప్టెంబర్ 18న: 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు
3. సెప్టెంబర్ 24న: 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

* రెసిడెన్షియల్ సొసైటీల్లో నియామకాలు

టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల కోసం 8,304 మందికి నియామక పత్రాలు ఇచ్చింది.

టీఎస్‌పీఎస్సీ – ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక మార్పులు

టీఎస్‌పీఎస్సీ ద్వారా 26 నోటిఫికేషన్ల ద్వారా 17,341 ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు నియామక పత్రాలు అందించారు. గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేయడంతో పాటు 8180 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.

గ్రూప్ 1, 2, 3 పరీక్షలు – కొత్త ప్రభుత్వం పర్యవేక్షణలో

పేపర్ లీకేజీ వివాదంతో నిలిచిపోయిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం రద్దు చేసి, జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించింది. జులై 7న ఫలితాలు ప్రకటించి, అక్టోబర్ 21-27 మధ్య మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. గ్రూప్ 2, 3 పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించనుంది.

పోలీస్ రిక్రూట్మెంట్ – కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు

2022లో నిర్వహించిన 16,929 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు కూడా పూర్తి చేయలేకపోయిన గత ప్రభుత్వాన్ని అధిగమించి, కొత్త ప్రభుత్వం నియామక పత్రాలు అందించింది.

మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ నర్స్ నియామకాలు

2022లో నిర్వహించిన 7,094 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడంలో విఫలమైన గత ప్రభుత్వ స్థానంలో, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలు అందించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..