కోవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై తెలంగాణ సర్కార్ వేటు వేసింది. హైదరాబాద్‌లో ఐదు ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్స్‌ను ఆరోగ్యశాఖ రద్దు చేసింది. బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రితో పాటు బేగంపేటలోని విన్ ఆస్పత్రి, కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్, సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్సులను రద్దు చేసింది. మరోవైపు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 64 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసింది. షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఆస్పత్రుల జాబితా ఇలా ఉంది..