Telangana: తెలంగాణ విద్యార్థుల అలర్ట్.. బుధ, గురువారం విద్యాసంస్థలకు సెలవు..

|

Jul 25, 2023 | 9:36 PM

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు బుధవారం, గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

Telangana: తెలంగాణ విద్యార్థుల అలర్ట్.. బుధ, గురువారం విద్యాసంస్థలకు సెలవు..
Holidays
Follow us on

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలకు బుధవారం, గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రుతుపవనాల ఎఫెక్ట్, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అవుతుండటం, ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తోడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధ, గురువారాల్లో అంటే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఆదేశించారు సీఎం. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..