Telangana Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో నడుస్తున్న ప్రోటోకాల్ వివాదంపై ఆమె స్పందించారు. తెలంగాణ (Telangana) మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నన్ను విమర్శిస్తున్నారని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేధించినా, రాజ్‌భవన్‌ను గౌరవిస్తానని, నేను గవర్నర్‌గా మాత్రమే పని చేస్తున్నా.. నాకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నానని నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారని అన్నారు.
ఆధారాలు లేకుండా తనను విమర్శిస్తున్నారని చెప్పారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తప్పా..? ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యమన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర సర్కార్ తన పని తాను చేసుకుపోతోందని, గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని అన్నారు. ఆహ్వానాలను రాజకీయంగా చూడవద్దని గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: