తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంకు సంబంధించి బిల్లుకు గవర్నర్ తమిళసై ఎట్టకేలకు ఆమోద ముద్ర వేశారు. దీంతో నిన్నటి నుంచి కొనసాగిన హైటెన్షన్‌కు ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. శనివారం తెలంగాణ ప్రభుత్వం పంపించిన డ్రాఫ్ట్ బిల్లును గవర్నర్ ఆమోదించలేదనే విషయం తెలిసిందే. బిల్లులో కొన్ని అంశాలపై స్పష్టత లేదని గవర్నర్ బిల్లు ఆమోదానికి బ్రేక్ వేశారు. అయితే తాజాగా ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడిన గవర్నర్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో దీనిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. గవర్నర్ ఆమోదంతో బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం ఈ రోజే అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది…
ఇదిలా ఉంటే అంతకు ముందు ఆర్టీసీ ఉన్నతాధికారులకు గవర్నర్ పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు తెలుసుకోనున్నా గవర్నర్.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సహా అధికారుల భేటీ అయ్యారు. అయితే, అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అనంతరం.. గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఆర్టీసీపై జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తాను వ్యతిరేకం కాదన్నారు.
ఆర్టీసీ బిల్లుపై కొన్ని విషయాలపై స్పష్టత కోసం ట్రాన్స్ పోర్టు సెక్రటరీని చర్చలకు రావాలన్నారు. ఇవాళ మధ్యాహ్నం ట్రాన్స్ పోర్టు సెక్రటరీతో సమావేశం జరుగుతుందన్నారు. ఆర్టీసీ విలీన బిల్లుపై సమగ్ర రిపోర్టును తీసుకుని రాజ్‌భవన్ రావాలని ఆదేశించారు. ఈ బిల్లుపై తాను వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు.
ఇదే అంశంపై గవర్నర్‌కు వివరించేందుకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సహా అధికారుల వెళ్లారు. అంతకు ముందు స్పీకర్‌తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. బిల్లును స్పీకర్ అనుమతితో టేబుల్ చేసే యోచనలో సర్కార్ ఉంది. సోమవారం వరకూ అసెంబ్లీ సమావేశాల పొడిగియనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం