Pawan kalyan – Alai Balai: హైదరాబాద్‌లో దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో ఏళ్లుగా సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలయ్ బలయ్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత కళాకారులతో కలిసి గవర్నర్ స్టెప్పులు వేశారు. గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు గవర్నర్ తమిళిసైకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో దసరా సంబురాలు గొప్పగా ఉన్నాయన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకొంటున్నామని చెప్పారు.
రాజ్‌భవన్‌లో కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకున్నామని గవర్నర్ వెల్లడించారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత 15 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను గవర్నర్ అభినందించారు.
ఇక, అలయ్ బలయ్ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.ఈ కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు సైతం హాజరయ్యారు.
Read also: AP Power Cuts: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై వదంతులు నమ్మొద్దు, కోతలు ఉండవు: ఏపీఈపీడీసీఎల్