
తెలంగాణ సర్కార్ ఈ నెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు విడతలుగా వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సారి 1050 కోట్ల ఎకరాలకు గాను రూ.9 వేలు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్లలో సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ క్రమంలో రైతు భరోసా గురించి చర్చ నడుస్తోంది. రైతు భరోసా కింద లబ్ది పొందేందుకు అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి..? ఎక్కడెక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఫిబ్రవరి 2026ల్లోపు పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు వేదికల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతు భరోసా అప్లికేషన్‌లో వివరాలు మొత్తం నింపాలి. ఇక దరఖాస్తు ఫారంతో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు అందించాలి. కేవలం కొత్త పట్టాలు పొందినవారు మాత్రమే ప్రస్తుతం దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలన చేపట్టి అర్హుల జాబితాలో చేరుస్తారు. అనంతరం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తారు.
ఈ నెల 22వ తేదీన రైతు భరోసా తొలి విడత నిధులను రేవంత్ విడుదల చేయనున్నారు. తొలి విడతలో 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనున్నారు. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరికల్లా రైతులందరికీ అందించనున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రస్తుతం అందించనున్నారు. ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. రెండు వాయిదాల్లో వీటిని అకౌంట్లలో జమ చేస్తోంది. అలాగే కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. గతంలో కేవలం భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చేవారు. కానీ రేవంత్ ప్రభుత్వం అధికారంలోక వచ్చాక కౌలు రైతులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో కౌలు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.