KCR Chenetha Bheema: రాష్ట్రంలోని రైతులు ఏ కారణంతో మరణించిన వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతు మరణిస్తే అతని నామినీ పేరిట ఉన్న బ్యాంకు అకౌంట్‌లో రూ. 5 లక్షలు జమ చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే చేనేత కార్మికులకు సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో సిరిసిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ పథకం పై ముఖ్యమంత్రి మరోసారి వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరి సందర్భంగా సీఎం ఈ విషయాన్ని మరోసారి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు బీమా కలిపిస్తామని తెలిపారు. రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు సైతం బీమా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. చేనేత శాఖ అధికారులు బీమా వర్తింపు వ్యవస్థను రూపొందిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. త్వరలో రైతులకు వర్తించినట్లే చేనేత కార్మికులకు కూడా బీమా వస్తుందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక రైతు బంధు, రైతు బీమా చేపట్టడానికి ఏడాది కాలం పట్టిందని తెలిపిన ముఖ్యమంత్రి.. చేనేత బీమా కూడా కొద్ది రోజుల్లోనే వస్తుందన్నారు. అంతేకాకుండా దళిత సంక్షేమశాఖలో కూడా దళితులకు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నవాళ్లకు బీమా కలిపిస్తామని చెప్పుకొచ్చారు. ఈ పథకంపై త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Also Read: AP Road Accident: కాసేపట్లో ఇంటికి చేరుతారనగా.. దూసుకొచ్చిన మృత్యువు.. ఇద్దరు దుర్మరణం..
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం.. ఆ బ్యాంకుకు రూ.5 కోట్ల జరిమానా విధింపు..!
Police Beat: మాస్కు ధరించకపోతే కాలితో తన్నాలా.? తీవ్ర విమర్శలకు దారి తీస్తోన్న నెల్లూరు ఎస్‌ఐ తీరు..