
తెలంగాణ అభివృద్ధి ఎలా? ఎనర్జీ రంగంలో తీసుకురావల్సిన మార్పులేంటి? రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలేవి? ఇవే అంశాలు టార్గెట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ మూడు రోజుల పర్యటన తర్వాత దావోస్ చేరుకోనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎనకామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు.
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తొలిరోజు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు.
విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటిఇ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువతకు నిపుణ్యం కలిగిన విద్యను అందించాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటిఇ లో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటిఇకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (yisu.in) తన శిక్షకులకు ఐటిఇ తో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
గురువారం(జనవరి 16) సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ చేరుకుంది. అక్కడ మూడు రోజుల పర్యటన తర్వాత దావోస్ చేరుకోనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎనకామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్‌గా సీఎం రేవంత్ పర్యటన సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ ఐటీ , పరిశ్రమలమంత్రి శ్రీధర్‌బాబు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..