Telangana: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆగస్ట్ 31 నుంచి కొత్త పథకం ప్రారంభం!
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యార్థులకు పోషకమైన బ్రేక్‌ఫాస్ట్‌ను అందించే ఉద్దేశంతో సింగరేణి సీఎస్ఆర్ నిధులు, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పక్కా శాఖాహారంతో కూడిన పోషకాహార అల్పాహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఆగస్ట్ 31 నుంచి ఈ పథకాన్ని అధికారికంగాల్లో ఆమల్లోకి తీసుకురానుంది.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్ధాకలితో ఉండకూడదనే ఉద్దేశంతో, వారిలో చదువుపై ఏకాగ్రత పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ‘రూఫ్ టాప్ ఆటోమేటెడ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసింది. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లోని 40 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పక్కా శాఖాహారంతో కూడిన పోషకాహార అల్పాహారాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 31 నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయనుంది.
అత్యాధునిక సాంకేతికత.. భారీ వంట సామర్థ్యం
విద్యార్థులందరికీ వేగంగా, పరిశుభ్రమైన వాతావరణంలో అల్పాహారం అందించేందుకు కిచెన్‌లో భారీ సామర్థ్యం కలిగిన ఆధునిక యంత్రాలను అమర్చారు. గంటకు 8 వేల ఇడ్లీలు, 3 వేల దోశలు, 5 వేలకు పైగా పూరీలు తయారు చేసేలా ఈ వంటశాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు మధ్యాహ్న భోజనం ఏర్పాటు కోసం కేవలం 15 నిమిషాల్లోనే 1,000 మందికి సరిపడా అన్నం, 2 గంటల వ్యవధిలో 5 వేల మంది విద్యార్థులకు సరిపడా సాంబారు, కూరలు వండేలా పరికరాలను ఈ కిచెన్‌లో అమర్చారు. అలాగే కూరగాయలను శుభ్రం చేయడానికి, తరగడానికి ప్రత్యేక వెజిటబుల్ వాషింగ్, కటింగ్ యూనిట్లతో పాటు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ
ఈ వంటశాలలో స్వచ్ఛమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్, నిరంతర ఆవిరి సరఫరాకు బాయిలర్ ప్లాంట్, వంట గ్యాస్ కోసం సెంట్రల్ గ్యాస్ బ్యాంక్ వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి ఉంచారు. వీటితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వ్యర్థ నీటిని శుద్ధి చేసేందుకు కూడా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వంట ప్రక్రియలో వెలువడే వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ తయారు చేసే ప్రత్యేక వ్యవస్థను కూడా ఈ కిచెన్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే కిచెన్‌లోకి వచ్చే ఏ ఒక్క పదార్థం కూడా పనికి రాకుండా పోదు. ప్రతి ఒక్కదాన్ని సమర్థవంతంగా వినియోగించేలా దీన్ని తీర్చి దిద్దారు అధికారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
