తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను తాజాగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. పోరాట స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా పిడికెల్లో బిగిసిన చేతులతో, నుదుటిన ఎర్రటి కుంకుమ బొట్టుతో చెవికి బంగారు కమ్మలతో, ఆకుపచ్చ రంగు చీరలో, ఎడమ చేతిలో కంకి, మొక్కజొన్న కంకి, చేతికి ఎర్రటి ఆకుపచ్చ గాజులు, కాలికి మెట్టెలు గజ్జలు, ముక్కుకి ముక్కు పడక, మెడలో మూడు రకాల ఆభరణాలు ధరించి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ విగ్రహం సాధారణ మహిళను పోలినట్లుగా ఉంది. సచివాలయంలోని ప్రాంగణంలో 20 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సగటు తెలంగాణ ఆడపడుచుకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ నెల 9న లక్ష మంది మహిళలతో కలిసి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసిఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. వీరితోపాటు తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు విద్యావంతులకు వివిధ రంగాల్లో ప్రముఖులందరికీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆహ్వానాలు అందనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి