Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

|

Feb 26, 2022 | 10:18 PM

Bayyaram Steel Plant: శతాబ్దాల చరిత్రకే కాదు.. అపారమైన నిక్షేపాలకూ ఆ ప్రాంతం నిలయం. బయ్యారం చెరువు చెబుతుంది

Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Bayyaram
Follow us on

Bayyaram Steel Plant: శతాబ్దాల చరిత్రకే కాదు.. అపారమైన నిక్షేపాలకూ ఆ ప్రాంతం నిలయం. బయ్యారం చెరువు చెబుతుంది క్రీ.శ 1219 నాటి కాకతీయుల వైభవం గురించి..! ఇక్కడి శాసనాలు చెబుతాయి.. బయ్యారం ప్రాముఖ్యత గురించి..! అలాంటి బయ్యారం ఇప్పుడు భగ్గుమంటోంది. ఎన్నో నిక్షేపాలను తన గుండెల్లో పదిలంగా దాచుకున్న ఆ ప్రాంతంపై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తోంది. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం మరోసారి ఉక్కు పిడికిళ్లు ఎగశాయి. బయ్యారంపై ప్రత్యేక కథనం..

బయ్యారం ఒడి.. బంగారంతో సమానం అంటారు. ముడిఖనిజాన్ని తన గర్భంలో భద్రంగా దాచుకుందా ప్రాంతం. అందుకే అక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. దశాబ్దాల నాటి డిమాండ్‌కు కేంద్రం ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు కల్గుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలోని సంస్థలే.. బయ్యారంలో అపారమైన ఖనిజసంపద ఉందని చెబుతుంటే.. కేంద్రం మాత్రం.. అబ్బెబ్బే అదేం లేదని బుకాయించే యత్నం చేస్తోంది.

బయ్యారంలో ముడి సరుకు ఉంది.. కళ్లెదుట కనబడుతూనే ఉంది. కావాల్సిందల్లా పరిశ్రమ ఒక్కటే. అందుకు అనుమతులు ఇస్తూ.. నిధులు విడుదల చేయాలి. ఆ దిశగా కేంద్రం అడుగులు వేయాలి. కానీ కేంద్రం తీరు భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అడ్డుకట్ట వేస్తోంది. దాంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. “బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు” అన్న నినాదంతో పోరుకు సై అంది.

1953 నుంచి జరిగిన ప్రతీ సర్వేలో.. బయ్యారంలో నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ ఉందనే చెబుతూ వచ్చాయి. కానీ కేంద్రం మాత్రం.. అలాంటి ఉక్కు అక్కడ లేదన్న మాట వెనుక కుట్రకోణం ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో భాగంగానే.. పరిశ్రమకు కేంద్రం సుముఖంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ఉద్యమం కొత్త కాదంటూ కదం తొక్కిన తెలంగాణ ప్రభుత్వం.. ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు విశ్రమించమని చెబుతోంది. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతోంది.

వాస్తవానికి బయ్యారంపై పోరు ఈనాటిది కాదు. దశాబ్దాల నాటి కల. మరి అలాంటి ఉక్కు సంకల్పానికి అండగా నిలుస్తున్నదెవరు.. ఆశలను కూల్చుతున్నదెవరన్నది భవిష్యత్‌లో తేలుతుంది.

Also read:

IIPS Mumbai Jobs: ఐఐపీఎస్‌లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారానే ఎంపికలు..

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌.. రెండు దేశాలలో ఎవరు ఎక్కువ శక్తివంతులు

Russia – Ukraine Conflict: పారిపోను.. ఆయుధాలివ్వండి.. అమెరికా ఆఫర్‌కు ఉక్రెయిన్ అధ్యక్షుడి రిప్లై..