Beer Rates Cut: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!

|

Jul 05, 2021 | 12:47 PM

మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీర్ల రేట్లను తగ్గించనుందని తెలుస్తోంది. అన్ని రకాల బ్రాండ్ల..

Beer Rates Cut: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు.. వివరాలివే.!
Beers
Follow us on

మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీర్ల రేట్లను తగ్గించనుందని తెలుస్తోంది. అన్ని రకాల బ్రాండ్ల బీర్లపై రూ. 10 తగ్గించాలని ప్రణాళికలు సిద్దం చేసిందట. ఈ మేరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. బీర్ల అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో కేసీఆర్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మద్యం దుకాణాల్లో ఉన్న పాత స్టాక్‌కు కాకుండా.. డిస్టిల్లరీలో ఉత్పత్తి చేసే కొత్త స్టాక్‌కు ఈ ధరలను వర్తింపజేయాలని చూస్తోంది. కాగా, గతేడాది లాక్‌డౌన్ కారణంగా సామాన్యుల బ్రతుకులు చెల్లాచెదురు అయిన సంగతి తెలిసిందే. చాలామంది ఉద్యోగాలను సైతం కోల్పోయారు. అలాగే ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా గండి పడింది. ఈ నేపధ్యంలో అప్పుడు తెలంగాణ సర్కార్ అమాంతం పెంచేసింది. దీనితో ప్రస్తుతం లైట్ బీర్ ధర రూ. 150గా ఉంది.

Also Read: 

రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

 మెడలో పాముతో వృద్ధుడు సైకిల్‌పై సవారీ.. వీడియో చూస్తే మీరూ ఔరా అనాల్సిందే!