Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

|

Jan 22, 2022 | 11:29 AM

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. ఐపీఎస్‌, ఐఏఎస్‌, అదనపు కలెక్టర్‌..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు
Follow us on

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించింది ప్రభుత్వం. ఐపీఎస్‌, ఐఏఎస్‌, అదనపు కలెక్టర్‌ హోదా, నాన్‌ కేడరర్‌ అధికారులను బదిలీ చేయడం, అలాగే వేయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లను ఇస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

► జగిత్యాల అదనపు కలెక్టర్‌గా బీఎస్‌ లత

► నారాయణ్‌పేట అదనపు కలెక్టర్‌గా పద్మజారాణి

► రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా బీమానాయక్‌

► వ‌రంగ‌ల్ అద‌న‌పు కలెక్టర్‌గా కె . శ్రీ‌వాస్తవ

► ములుగు అద‌న‌పు కలెక్టర్‌గా గా వై వి గ‌ణేష్

► మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అద‌న‌పు కలెక్టర్‌గా ఎం డేవిడ్

► నాగ‌ర్ క‌ర్నూల్ అద‌న‌పు కలెక్టర్‌గా ఉన్న పీ శ్రీ‌నివాస‌రెడ్డి సిద్ధిపేటకు బదీలీ చేశారు.

► అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పాలనాధికారి చంద్రమోహన్‌ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా బదీలీ చేశారు.

► చంచ‌ల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్‌తో పాటు హైద‌రాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా బీ. సంతోషిని నియమించింది ప్రభుత్వం. వీరేతో పాటు పలువురు నాన్‌ కేడ‌ర్ అధికారుల‌ను కూడా బ‌దిలీ చేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

EPFO Pension Scheme: ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌ స్కీమ్‌.. పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.7500 నుంచి రూ.25000 పెరిగే అవకాశం..!

PM Svanidhi: మీ ఆధార్‌కు మొబైల్‌ నంబర్‌ లింకై ఉందా..? రూ.10వేల బెనిఫిట్‌ పొందవచ్చు.. ఎలాగంటే..!