Telangana: ఆ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ

|

Aug 24, 2021 | 8:21 PM

TS news: అగ్రవర్ణ పేదలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ తెలిపింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ..

Telangana: ఆ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ
Follow us on

TS news: అగ్రవర్ణ పేదలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ తెలిపింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఉత్వర్వుల్లో వెల్లడించింది. రూ.8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఆదాయ ధృవపత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారు. ధృవపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నంట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

అలాగే ఈడబ్ల్యూఎస్‌ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్‌ వారికి నియామకాల్లో ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తరహాలో పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాకు అనుగుణంగా విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనుంది ప్రభుత్వం. రిజర్వేషన్ల కోసం సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలకు సవరణ చేశారు. నియామకాల్లో రోస్టర్‌ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ఉత్తర్వులు జారీ చేయడం నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం.. భవిష్యత్తులో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు పేదల బంధు: కేసీఆర్

Income Tax: మీరు ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా..? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకపోతే నష్టమే..!