AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

Hyderabad: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నేతలు.

Hyderabad: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
Krishank
Shiva Prajapati
|

Updated on: Aug 24, 2021 | 9:25 PM

Share

Hyderabad: చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నేతలు. నవీన్ కుమార్‌పై కంప్లైంట్ చేసిన వారిలో టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్స్ క్రిశాంక్, వై సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్మోహన్ రావు ఉన్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసులపై, రాష్ట్ర ప్రభుత్వంపై నవీన్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన వీరు.. యూట్యూబ్ ఛానెల్‌ను అడ్డం పెట్టుకుని వార్తలు చదువుతున్నాడా? తిట్లు చదువుతున్నాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు. జర్నలిజం అంటే బూతులు తిట్టడమా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఆఫ్గనిస్తాన్‌తో పోల్చాడని, మరి ఇంత స్వేచ్ఛ ఆఫ్గనిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు.

నిజంగానే ఆఫ్గనిస్తాన్‌ మాదిరిగా పరిస్థితులు ఉంటే.. నీకు ఇంత స్వేచ్ఛ ఉంటుందా? అంటూ టీఆర్ఎస్ ఐటీ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకు కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఊరుకుంటున్నామని, మళ్లీ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ నవీన్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మొన్న కేంద్ర మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోలీసులు అరెస్ట్ చేశారని టీఆర్ఎస్ నేతలు ఉటంకించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఎవరితోనూ టీఆర్ఎస్ పార్టీ విభేదాలకు పోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, చింతపండు నవీన్ కుమార్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్న విషయం తెలిసిందే. పలు కేసుల్లో నవీన్ కుమార్‌ను పోలీసులు విచారించారు కూడా. మరి తాజా ఫిర్యాదు ఎక్కడికి వరకు వెళ్తుందో వేచి చూడాలి.

Also read:

Walnuts: మీకు ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది చెబుతోంది ఎవరో కాదు.

చెత్తకుప్పలో ఆడశిశువు.. చేరదీసిన పోలీస్‌.!పసికందు పట్ల మరి ఇంత దుర్మార్గమా అంటూ ఆవేదన..:Viral Video.

100ఏళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్‌టైమ్‌..!ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం..: USA Floods Video.