Liquor Store Tenders: మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ విడుదల.. తేదీల వివరాలు ఇవే..

| Edited By: Anil kumar poka

Nov 08, 2021 | 3:10 PM

తెలంగాణలో కొత్త మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది ప్రభుత్వం. టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ..

Liquor Store Tenders: మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ విడుదల.. తేదీల వివరాలు ఇవే..
Telangana Liquor Shop
Follow us on

తెలంగాణలో కొత్త మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టింది ప్రభుత్వం. టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌గా రూ.2 లక్షలు చెల్లించాల‌ని నిర్ణయించింది. మద్యం షాపుల లాటరీని ఈ నెల 20వ తేదీన తీయనున్నట్లు చెప్పింది. కొత్త లైసెన్స్‌లు కావాలనుకునే వారు రూ. 2 లక్షల నాన్‌ రిఫండబుల్‌ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈసారి షాపుల్లో రిజర్వేషన్లు పెట్టారు. గౌడ్స్‌కు 15 శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

ఈ నెల 16వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు ఉంది. 18వ తేదీన డ్రా తీస్తారు. ఈసారి ఒకరు ఎన్ని అప్లికేషన్లు అయినా పెట్టుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1వ తేదీ నుంచి నవంబర్‌ 2023 వరకు మద్యం షాపులకు అనుమతి ఉంటుంది.

అక్టోబర్ నెలలోనే 2019-21 ఎక్సైజ్ పాలసీ ముగిసింది. అయితే కరోనా కారణంగా, లాక్ డౌన్ రావడంతో ఈ ఏడాది మరో నెల మద్యం షాపుల గడువు పొడగించారు. అయితే తాజాగా 2021-23 మద్యం షాపులకు టెండర్ల షెడ్యూల్ ను ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉన్నాయి. కొత్తగా మరో 10 శాతం మద్యం దుకాణాలను పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఉంటాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడలకు 15 శాతం కేటాయించనుంది.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..