Telangana: వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్

|

Jun 16, 2021 | 7:38 AM

తెలంగాణ వైద్య విధాన పరిషత్​ కింద పనిచేసేందుకు అవసరం అయిన సిబ్బంది నియామకానికి స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివిధ విభాగాలో కలిపి 2383 మందిని....

Telangana: వైద్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌  సిబ్బంది నియామకానికి తెలంగాణ స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్
Telangana-Government
Follow us on

తెలంగాణ వైద్య విధాన పరిషత్​ కింద పనిచేసేందుకు అవసరం అయిన సిబ్బంది నియామకానికి స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివిధ విభాగాలో కలిపి 2383 మందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచిస్తూ…. ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 491 పోస్టులు కాంట్రాక్ట్, 1892 పోస్టులు ఓట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఏడాది పాటు విధుల్లో కొనసాగేందుకు ఈ నియామకాలు చేపట్టాలని ప్ర‌భుత్వం పేర్కొంది. అందుకు తగిన చర్యలు చేపట్టాలని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్​ని ఆదేశిస్తూ… ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రొస్ ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు 222 పోస్టులు కేటాయించారు. ఇందులో 65 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో, 157 పోస్టులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఫిల్ చేయనున్నారు. సంవ‌త్స‌ర‌ కాలం వరకు వీరికి అగ్రిమెంట్‌ ఉంటుంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ఐసీయూ హెడ్‌, జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌, రేడియాలజీ టెక్నీషియన్‌, వెంటిలేటర్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌, ఎక్స్‌రే అటెండెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, థియేటర్‌ అసిస్టెంట్‌, ఈసీజీ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, ఆఫీసు అటెండర్లు, రేడియోగ్రఫర్‌, స్వీపర్స్‌, ధోబీలు, సెక్యూరిటీ గార్డులు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 17 కాంట్రాక్టు పోస్టులు, 43 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు, మహబూబ్‌నగర్‌లో 3 కాంట్రాక్టు, 7 అవుట్‌ సోర్సింగ్‌, నారాయణపేటలో 15 కాంట్రాక్టు, 34 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు…  వనపర్తిలో 13 కాంట్రాక్టు, 21 అవుట్‌ సోర్సింగ్‌, జోగుళాంబ గద్వాలలో 17 కాంట్రాక్టు, 52 అవుట్‌ సోర్సింగ్‌,భర్తీ చేయనున్నారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారి కనీస వేతనం పెంపు..

 పులివెందులలో మా ప్రాణాలకు ముప్పు ఉంది.. భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత