Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి ఆ ప్రాంతాలలో..

|

Jul 20, 2022 | 7:54 AM

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ మార్పులు, భారీ వర్షాలు కారణంగా సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి ఆ ప్రాంతాలలో..
Telangana Govt
Follow us on

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ మార్పులు, భారీ వర్షాలు కారణంగా సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించింది తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖ. ఈ నేపథ్యంలోనే.. జియోగ్రాఫికల్ ఆధారంగా వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. వీటిని నాలుగు భాగాలుగా విభజించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటా ఫీవర్ సర్వే చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే.. మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా ప్రబలకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 297 హై రిస్క్ ఏరియాలను గుర్తించిన వైద్యారోగ్య శాఖ.. వరద ప్రభావిత ప్రాంతాలకు 670 మంది అదనపు వైద్య సిబ్బంది తరలించింది. అ సర్వే సందర్భంగా ప్రతి ఇంటికి క్లోరిన్ మందు బిల్లల పంపిణీ చేయనున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..